![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ 'బుధవారం నాటి ఎపిసోడ్ -1093 లో.. దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటారు. రేయ్ నీకు బుద్ధి ఉందా. మనం చేసిన నేరాలను మన నోటితోనే చెబుతావా అని శైలేంద్రపై దేవయాని ఫైర్ అవుతుంది. జగతికి జ్యూస్‌లో విషం ఇచ్చిన చంపిన విషయాన్ని చెప్పడాన్ని శైలేంద్ర గుర్తుచేసుకుంటాడు. దీన్నే ఓవర్ కాన్ఫెడెన్స్ అంటారు. అసలు వసుధార అంటే ఏమనుకున్నావురా. తను తెగిస్తే మాములుగా ఉండదని దేవయాని అంటుంది. నా కనుసైగళ్లలో ఉంచుకున్న రిషిని మార్చేసిందిరా. నేను ఎంత ట్రై చేసిన ఇంటి కోడలు అయింది. నిన్ను కూడా రోడ్డు మీద నిలబెట్టి ఏం చేసిందో చూశావుగా అని దేవయాని అంటుంది. అది అప్పుడు.. ఇప్పుడు తన బలం రిషి లేడు. తను బాధలతో పీకల్లోతూ కూరుకుపోయిందని శైలేంద్ర అంటాడు.
అసలు వాళ్ల మనసులో ఏముందో తెలుసా. నువ్వు వాళ్లను సరిగ్గా అంచనా వేయలేకపోయావ్ కాబట్టే నిన్ను దెబ్బ కొడుతున్నారు. నీకు అసలు ఓపిక లేదని దేవయాని అంటుంది. ఇక నువ్వేం చేయలేవని నాకు అర్థమైంది. సైలెంట్‌గా ఓ మూలన కూర్చోమని దేవయాని తిడుతుంది. దాంతో అలా గడ్డి పెట్టండని ధరణి ఎంట్రీ ఇస్తుంది. నేను ఏం చేయాలో నీకు తెలుసా అని శైలేంద్ర ఫైర్ అయితే.. లేదు.. మీరు సరిగా వర్క్ చేయలేరని అత్తయ్య అంటున్నారు కదా.. ఆకాశంలో చందమామను చూస్తాం కానీ అందుకోవడానికి ట్రై చేసినా దొరకదని ధరణి అనగానే పొంతనలేకుండా మాట్లాడుతున్నావని దేవయాని అంటే.. ఎందుకు లేదని ధరణి అంటుంది. మరోవైపు వసుధార, మహేంద్ర కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. రిషి గారి గురించి కంప్లైంట్ ఇచ్చిన కేసు ఎక్కడిదాకా వచ్చిందని ఎస్సైని అడుగుతుంది వసుధార. ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయింది కదా. ఆయన చనిపోయారని ప్రూవ్ అయింది కదా అని ఎస్సై అంటాడు. రిషి సార్ చనిపోవడమేంటి.. ఆయన ఇంకా బతికే ఉన్నారు. రిషి సర్ జాడ తెలుసుకోండి అని వసుధార అంటుంది. మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. డీఎన్ఏ రిపోర్ట్స్, డెడ్ బాడీ అన్ని రిషి సారే అని చెప్పాయి కదా అని ఎస్సై అంటాడు. సర్ నేను మీతో వాదించడానికి రాలేదు. ప్లీజ్ రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోండని వసుధార అంటుంది. రిషి సర్ గురించి ఇన్నాళ్లుగా ఎందుకు తెలియడం లేదు. ఒకటి ఆయనకు మీరంటే ఇష్టం లేక దూరంగా వెళ్లిపోయి ఉంటారని ఎస్సై అంటాడు. మా బంధం గురించి మీకు చెప్పిన అర్థం కాదు అని వసుధార అంటుంది. సరే రిషి సర్ బ్రతికే ఉన్నారని ఒక్క క్లూ తీసుకురండి. నేను కేస్ రీ-ఓపెన్ చేసి నేను వెతుకుతానని ఎస్సై అంటాడు.
మనకంటే రిషి సర్ గురించి తెలియట్లేదు. సారైనా మన దగ్గరికి రావాలి కదా. సర్‌కు నాపైనా కోపమా. అలిగారా. లేదు ఆయన ఎప్పటికి అలా నాపై కోప్పడరు. నా కంట్లో నీళ్లు తిరిగితేనే రిషి సర్ భరించరు. అలాంటిది ఇన్నాళ్లు ఎందుకు దూరంగా ఉన్నారని రిషి కోసం చేసిన పనులను మహేంద్రకు చెబుతుంది వసుధార. అందరు రిషి సర్ గురించి ఏదేదో అంటున్నారు. కానీ, నేను ఇంకా బతికే ఉన్నాను కదా. నా ఊపిరి ఆగిపోయినప్పుడు రిషి సర్‌కు ఏమైనా అయినట్లు అని వసుధార అంటుంది. రిషి సర్ బతికి ఉన్నాడనటానికి ఆధారం నేను బతికి ఉండటమే అని వసుధార అంటుంది. ఎవరు నమ్మిన నమ్మకపోయినా, నేను నిన్ను నమ్ముతున్నాను. నీ నమ్మకమే నిజం కావాలని మహేంద్ర అంటే.. అది నీ భ్రమ బాబాయ్ అని శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |